అల్లు అర్జున్‌ రాజకీయ ఎంట్రీ కేవలం...!

అల్లు అర్జున్‌ రాజకీయ ఎంట్రీ కేవలం...!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తెలంగాణలో ఆయన రాజకీయ పార్టీ వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతుందని, తమిళనాడులో విజయ్ ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాడో అదే విధంగా తెలంగాణలో అల్లు అర్జున్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న పోస్టులు చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయమై ఇప్పటి వరకు అల్లు అర్జున్ నుండి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే బన్నీ టీమ్ మెంబర్స్ మాత్రం ఇవన్నీ కేవలం పుకార్లే అని కొట్టి పారేశారు.

సోషల్ మీడియా ఔత్సాహికులు కొందరు చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోనక్కర్లేదని, అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాల పై మాత్రమే దృష్టి పెట్టాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన వివాదం కారణంగానే అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన చేశాడు అంటూ జరుగుతున్న ప్రచారం విషయంలో ఎలాంటి నిజం లేదని ఆయన టీమ్ మెంబర్ చెప్పగానే చెబుతున్నారు. తెలంగాణలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో పార్టీ పెడితే కచ్చితంగా మంచి స్పందన వస్తుందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెట్టడం అనేది నిజం కాదు, అసలు ఆయనకు ఒక్క శాతం కూడా రాజకీయ పార్టీ పెట్టాలని ఆలోచన లేదు అనేది వాస్తవం. ఇదంతా కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే.

ఆయన అభిమానులు కొందరు విజయ్ విజయం తర్వాత సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారానికి తెర లేపారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఉన్న ఫామ్ తో వరుసగా సినిమాలు చేసి అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయాల్లోకి ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ రావాల్సిన అవసరమేమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ కోసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని తెలిసిందే. మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా రాజకీయ ఎంట్రీ గురించి చర్చ అనవసరం అనేది కొందరి భావన. భవిష్యత్తులో అల్లు అర్జున్ రాజకీయాల్లో అడుగు పెట్టాలి అనుకుంటే అప్పుడు ఏ రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతాడు అనేది చూడాలి. హీరోలు అంతా రాజకీయాల్లోకి అనుకోవడం కరెక్ట్ కాదు అనేది చాలా మంది అభిప్రాయం. అల్లు అర్జున్ ప్రస్తుతానికి రాజకీయాల్లో అడుగు పెడతాడు అనుకోవడం అవివేకం అవుతుంది. ఆయన నుంచి రావలసిన మంచి సినిమాలు చాలానే ఉన్నాయని, ఆయనను రాజకీయకుడిగా చూడాలనుకోవడం లేదని కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకుంటున్నారు.

...likes

Comments (0)

Leave a Comment

0/1000 characters
Loading comments...