రివ్యూ: ‘భారతీయుడు-2’

Movie Review-
2.5/5
రివ్యూ: ‘భారతీయుడు-2’

Our Rating

2.5/5
2.5
out of 5

ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘భారతీయుడు’ మూవీ. దేశంలో పెరిగిపోయిన లంచగొండితనం, అవినీతి గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకునేలా చేసింది. కేవలం సందేశం మాత్రమే కాదు, వినోదాత్మక అంశాలు, అదిరి పోయే సంగీతంతో అప్పట్లో ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.

మరి అలాంటి చిత్రానికి సీక్వెల్... అందులోనూ సేమ్ కాంబినేషన్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. మరి ఈ అంచనాలను ‘భారతీయుడు-2’ అందుకునేలా ఉందా? రివ్యూలో సమీక్షిద్దాం.

కథ:

భారతీయుడు పార్ట్ -1లో తను నమ్మిన సిద్ధాంతంతం కోసం దేశంలోని అవినీతి కలుపును ఏరిపారేసి, లంచగొండి తెగులు నాశనం చేయడంలో భాగంగా చివరకు తన కన్న కొడుకును కూడా చంపి తన నిఖార్సయిన దేశభక్తిని చాటుకుంటాడు. ఎవరికీ చిక్కకుండా దేశం విడిచి వెళ్లిన సేనాపతి(కమల్ హాసన్) ప్రజలకు ఒక బలమైన సందేశం ఇస్తాడు. కలుపు తీసేసినా మళ్లీ పెరిగినట్లుగా... గడిచిన 28 ఏళ్లలో దేశంలో మళ్లీ అవినీతి, లంచగొండితనం, స్వార్థం లాంటివి పెరిగిపోతాయి.

చిత్ర అరవిందన్(సిద్ధార్థ్) మరియు అతడి స్నేహితులు సమాజంలో జరిగే అవినీతి, లంచగొండితనం, అన్యాయాలను సోషల్ మీడియాలో ఎక్స్ పోజ్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు. అయితే కరప్ట్ అయిపోయిన ఈ వ్యవస్థలో వారి పోరాటాల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. భారతీయుడు(సేనాపతి) వస్తే తప్ప ఈ సిస్టం బాగుపడదు అనే అభిప్రాయానికి వస్తారు. భారతీయుడిని తిరిగి రప్పించేందుకు అతడి కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. #ComeBackIndian అనే హాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేయడం ద్వారా దేశంలోని యువత మొత్తం ఆయన రావాలని కోరుకునేలా చేయడంలో సక్సెస్ అవుతారు.

దేశంలోని యువత కోరిక మేరకు సేనాపతి (కమల్ హాసన్) ఇండియా రావడం, తన దైన శైలిలో మర్మకళ ఉపయోగిస్తూ తప్పు చేసిన వారిని శిక్షించడం చేస్తుంటాడు. అయితే అవినీతి నిర్మూలన కేవలం తన ఒక్కడితోనే సాధ్యం కాదు అని, యవత కూడా అందులో భాగం కావాలని, మీ కుటుంబంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని పట్టించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచే క్లీనింగ్ మొదలు పెట్టాలని, అప్పుడే దేశం బాగు పడుతుందని.... గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను క్లీనింగ్ మొదలు పెడదాం అంటూ యువతకు సూచిస్తాడు.

సేనాపతి మాటలకు చిత్రఅరవిందన్ టీంతో పాటు దేశంలోని యువత ప్రభావితం అవుతారు. తమ తల్లిదండ్రులు, బంధువులు చేసే అవినీతిని ఎక్స్ పోజ్ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఎంతో మంది యువత కుటుంబాలకు దూరం అవుతారు. చిత్ర అరవిందన్ తన తల్లిని కోల్పోతాడు. దీంతో భారతీయుడిపై అందరికీ విరక్తి పుడుతుంది. #GoBackIndian అంటూ దేశంలోని ప్రజలంతా ఆతడికి వ్యతిరేకం అవుతారు. అతడి ప్రాణాలతో పట్టుకునేందుకు సీబీఐ ఆఫీసర్ బాబీ సింహా.... అతడిని చంపేందుకు అవినీతిపరులు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సేనాపతి ఏం చేశాడు? ఈ సినిమాకు ముగింపు ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.

పెర్ఫార్మెన్స్...

కమల్ హాసన్ తనదైన నటనతో సేనాపతి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిత్ర అరవిందన్ గా సిద్ధార్థ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సేనాపతిని పట్టుకునే సీబీఐ ఆఫీసర్ పాత్రలో బాబీ సింహా పెర్పార్మెన్స్ బావుంది.

సముద్రఖని, ఎస్ జె సూర్య, ప్రియ భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్ నటనకు స్కోప్ లేని పాత్రలకు పరిమితం అయ్యారు.

టెక్నికల్ అంశాలు...

అనిరుధ్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా ఆకట్టుకోలేదు. రవి వర్మ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.

శ్రీకర్ ప్రసాద్ ఎడింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది. సినిమా నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి.

సినిమా ఎలా ఉందంటే..

సాధారణంగానే శంకర్, కమల్ హాసన్ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ భారతీయుడు సీక్వెల్ కావడంతో ప్రేక్షకులు ఇంకా ఏదో కొత్త దనం ఆశించడం, తమ ఊహకు అందని అద్భుతాన్ని తెరపై చూపిస్తారని ఆశ పడటం సర్వసాధారణం. అయితే ఈ విషయంలో దర్శకుడు శంకర్ ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచాడు.

చాలా పేలవంగా ఒక అవుట్ డేటెడ్ సీన్స్ లైన్ లో సినిమాను నడిపించాడు. శంకర్ మార్క్ భారీ తనం సినిమాలో కనిపించినప్పటికీ అవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా కథ చాలా నిరాశ పరిచే విధంగా ఉంది. భారతీయుడు రీ ఎంట్రీ సీక్వెన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా స్క్రీప్లే నడిపించిన తీరు ప్రేక్షకులకు కిక్ ఇవ్వలేదు.

సిద్ధార్థ్ తన తల్లిని కోల్పోయిన తర్వాత కమల్ హాసన్, సిద్ధార్థ్ మధ్య జరిగే సీక్వెన్స్ లో ఎమోషన్స్ పెద్దగా పండలేదు. క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా.... సినిమాను ఎలా ముగించాలో అర్థం కాక పార్ట్-3కి ముడిపెట్టారనే భావన కలిగించేలా ఉంది.

ప్లస్ పాయింట్స్:

కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్

సిద్ధార్థ్ పాత్ర

సినిమా నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

సంగీతం

ఎడిటింగ్

ఆకట్టుకోని కథ, కథనం

చివరగా...

భారీ అంచనాలతో ‘భారతీయుడు-2’ చూడటానికి వెళితే నిరాశ తప్పదు.

దర్శకులు : S. శంకర్

నిర్మాతలు: సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్

సంగీత దర్శకులు: అనిరుధ్ రవిచందర్

నటీనటులు : కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్